రక్త కన్నీరు మార్కెట్లు : మూడు రోజుల్లో 10లక్షల కోట్లు మటాష్

Telangana-Gets-Rs-1813-Crore-In-Railwayస్టాక్ మార్కెట్లు వణికిపోయాయి. అమెరికా, ఆసియా మార్కెట్లలోని నెగెటివ్ ట్రేడింగ్ ఇండియాపై పడింది. కేవలం మూడు రోజుల్లోనే.. రూ.10 లక్షల కోట్ల సంపద మాయం అయ్యింది. మంగళవారం ఒక్క రోజే రూ.3లక్షల కోట్లు సంపద ఆవిరి అయ్యింది. గత శుక్రవారం రూ.5లక్షల కోట్లు మాయం అయిన సంగతి తెలిసింది. మొత్తంగా మూడు రోజుల్లో.. మూడు సెషన్స్ లోనే రూ.10 లక్షల కోట్లు సంపద స్టాక్ మార్కెట్ నుంచి మాయం అయ్యింది.

ఫిబ్రవరి 6వ తేదీ మంగళవారం స్టాక్ మార్కెట్లు ఒపెనింగ్ లోనే బాంబే స్టాక్ ఎక్చేంజ్ సెన్సెక్స్ 1,200 పాయింట్లు కుప్పకూలింది. ట్రేడింగ్ చివర్లో కోలుకుని 561 పాయింట్ల నష్టంతో 34,195 దగ్గర ముగిసింది. నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ నిఫ్టీ 168 పాయింట్లు నష్టపోయి 10,498 దగ్గర ముగిసింది. ఎస్‌బీఐ, మారుతీ సుజుకీ, టాటా మోటార్స్‌, రిలయన్స్‌, టీసీఎస్‌ లాంటి ఇండెక్స్ హెవీ వెయిట్ షేర్లు అమ్మకాల కారణంగా మార్కెట్లు నష్టోయాయి. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ షేర్లు కూడా అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొన్నాయి. పరపతి సమీక్షలో కఠిన నిర్ణయాలు ఉంటాయనే ప్రచారం సెంటిమెంట్ ను దెబ్బతీసింది. RBI వడ్డీ రేట్లు పెంచితే నగదు లభ్యత కష్టం అవుతుంది. ద్రవ్యోల్బణం 17నెలల గరిష్ట స్థాయికి చేరుకోవడంతో RBI కఠిన నిర్ణయాలకు కారణమవుతుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

అమెరికా జాబ్స్‌ డేటా మార్కెట్‌ రిపోర్ట్స్.. సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. 2009 తర్వాత అమెరికాలో జీతాలు పెరిగిపోతున్నాయనీ.. దీంతో ద్రవ్యోల్బణం పెరిగిపోయే ప్రమాదం ఉండటంతో ఇన్వెస్టర్లు భారీగా అమ్మకాలకు పాల్పడ్డారు. ఫలితంగా డోజోన్స్‌, నాస్‌డాక్‌లు భారీ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా స్టాక్ మార్కెట్ రూ.7 లక్షల కోట్లు నష్టపోయినట్లు బ్లూమ్‌బర్గ్ అంచనా వేసింది. ఇందులో రూ.32 వేల కోట్లను ప్రపంచ కుబేరుడు వారెన్ బఫెట్ నష్టపోయాడు. 24 గంటల్లోనే ఆయన సంపద 32వేల కోట్లు తగ్గిపోయింది.

Posted in Uncategorized

Latest Updates