రక్త చరిత్ర : కోమటిరెడ్డి బ్రదర్స్ దే

VEMULAనల్గొండ జిల్లాలో హాట్ టాపిక్ గా నేతల హత్యల స్పందించారు ఎమ్మెల్యే వేముల వీరేశం. నల్గోండ జిల్లాలో రాజకీయ హత్యలు జరగడం అవాస్తవమన్నారు. రాజకీయ లబ్దికోసమే కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేశారన్న వీరేశం..హత్యలు చేసేంత పరిస్థితి నల్గొండలో లేదన్నారు. ఆరు దశాబ్దాలుగా జిల్లాలో ఫ్లొరిన్ సమస్యతో కొట్టుమిట్టాడుతున్న ప్రజలకు సీఎం కేసీఆర్ విముక్తిని కలిగించారన్నారు. తాగు ..సాగు నీటికోసం తీవ్రమైన ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. అభివృద్ధిని చూసి ఓర్వలేకనే కాంగ్రెస్ అనవసర రాద్ధాంతం చేస్తుందన్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్ ది ఫ్యూడల్ మెంటాల్టి అన్నారు. 20 ఏళ్లుగా జిల్లాకు కోమటిరెడ్డి చేసిందేమిలేదన్నారు. కోమటిరెడ్డి శవరాజకీయాలు చేస్తున్నారన్న వీరేశం..సొంతపార్టీ నేతలపై దాడులు చేయించడం కోమటిరెడ్డికి కొత్తేమికాదన్నారు. వాళ్లపార్టీ మనుషులను వాళ్లే చంపుకుని టీఆర్ఎస్ పై రుద్దుతున్నారని, రక్త చరిత్ర అంటే కోమటిరెడ్డి బ్రదర్స్ దేనన్నారు ఎమ్మెల్యే వేముల వీరేశం.

Posted in Uncategorized

Latest Updates