రక్షణ దళాల్లో 9096 అధికారుల పోస్టులు ఖాళీ

రక్షణ దళాల్లో 9096 అధికారుల పోస్టులు ఖాళీగా ఉన్నాయని బుధవారం (ఆగస్టు 1) లోక్‌సభలో వెల్లడించారు రక్షణ శాఖ సహాయ మంత్రి సుభాష్ భమ్రే. సైన్యంలో 49,933 మంది అధికారులకు గానూ 42,635 మందే ఉన్నారనీ, మిగిలిన 7298 పోస్టులను భర్తీ చేయాల్సి ఉందన్నారు సుభాష్ భమ్రే. అలాగే నౌకాదళంలో 1606, వైమానిక దళంలో 192 చొప్పున ఖాళీలున్నాయని తెలిపారు ఆయన. సరిహద్దులో రక్షణ నిమిత్తం ఒప్పందం కుదుర్చుకునేందుకు చైనా నుంచి కొత్త ప్రతిపాదనేమీ రాలేదని ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు సుభాష్ భమ్రే. సరిహద్దులో శాంతి, సుస్థిరత కొనసాగేలా చూడడంతో పాటు సైన్యాల మధ్య సహకారం పెంచడానికి అన్ని ప్రయత్నాలూ చేస్తున్నామన్నారు.

Posted in Uncategorized

Latest Updates