రగులుతున్న జ్వాల : అమెరికాలో మళ్లీ లావా కలకలం

LAVAలావా దెబ్బకు అమెరికా ప్రజలు అయోమయంలో పడుతున్నారు. గత కొన్నిరోజులుగా లావా ప్రమాదానికి గురై, ఎంతోమంది చనిపోగా భారీ నష్టం వాటిల్లుతోంది. శనివారం (మే-26) అమెరికాకు చెందిన హవాయ్ దీవుల్లో కిలావు అగ్ని పర్వతం బద్దలైంది. దీంతో అక్కడ ఓ వీధిల్లో లావా ఉప్పొంగింది. అనేక ఇండ్లు ధ్వంసం అయ్యాయి. లావా ప్రవాహిస్తున్న క్రమంలో.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలంటూ ప్రజలను ఆదేశించారు అక్కడి అధికారులు. లిలానీ ఎస్టేట్స్ హౌజింగ్ డెవలప్‌ మెంట్ వద్ద లావా విపరీతంగా పొంగింది. ఫెడరల్ ఎమర్జెన్సీ మానేజ్‌మెంట్ ఏజెన్సీ ప్రకారం మొత్తం 82 ఇండ్లు ఆ లావాలో కొట్టుకుపోయాయి. మొత్తం 890 హెక్టార్ల నేల లావాకు దెబ్బతిన్నది. వందేళ్ల తర్వాత కిలావు అగ్ని పర్వతం భారీ స్థాయిలో బద్దలైనట్లు చెబుతున్నారు అధికారులు.

Posted in Uncategorized

Latest Updates