రచ్చ మొదలెట్టారు : బడ్జెట్ పై దద్దరిల్లిన పార్లమెంట్

loksabha0502

లోక్‌సభ ప్రారంభమైన కొద్దిసేపటికి వాయిదా పడింది. సోమవారం (ఫిబ్రవరి-5) సభ ప్రారంభమైన తర్వాత కైరానా ఎంపీ హుకుంసింగ్ మృతిపట్ల లోక్‌సభ నివాళులర్పించింది. ఆ తర్వాత బడ్జెట్ కేటాయింపుల్లో తీవ్ర అన్యాయం జరిగిందని విపక్షాలు ఆందోళనకు దిగాయి. దీంతో సభను మంగళవారానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రకటించారు.

రాజ్యసభలోనూ ఆందోళన

ప్రతిపక్ష సభ్యుల నిరసనలతో రాజ్యసభ కూడా వాయిదా పడింది. ఏపీకి ప్రత్యేక హోదా, బడ్జెట్‌ కేటాయింపుల్లో అన్యాయం జరిగిందంటూ సభ్యులు ప్రశ్నించారు. ప్రత్యేక హోదాపై ఏపీ ఎంపీలు స్పీకర్ పోడియం చుట్టుముట్టారు. బడ్జెట్‌లో ఏపీకి తీవ్రమైన అన్యాయం జరిగిందని కాంగ్రెస్‌ ఎంపీ కేవీపీ ఆందోళన వ్యక్తం చేశారు. ఇక టీఎంసీ ఎంపీలు పెరిగిన పెట్రోల్‌ ధరలపై ఆందోళన చేశారు. నోయిడా నకిలీ ఎన్‌కౌంటర్‌ విషయంపై సమాజ్‌వాద్‌ పార్టీ నిరసన వ్యక్తం చేసింది. ఈ నిరసనల మధ్య రాజ్యసభను వాయిదా వేశారు చైర్మన్ వెంకయ్యనాయుడు.

 

Posted in Uncategorized

Latest Updates