రజినీ మార్క్ ‘పేట’ ట్రైలర్ విడుదల

రజినీకాంత్ హీరోగా నటిస్తున్న తమిళ సినిమా “పేట” ట్రైలర్ విడుదలైంది. ఈ మూవీని జనవరి 10న తమిళ, తెలుగు భాషల్లో విడుదల చేస్తున్నారు. తెలుగు డబ్ వెర్షన్ ఫస్ట్ లుక్ ఇటీవలే విడుదల చేశారు. రజినీకాంత్ నుంచి అభిమానులు ఆశించే స్టైల్, కామెడీ, యాక్షన్ అంశాల కలబోతగా పేట మూవీని తీసినట్టుగా ట్రైలర్ ను బట్టి అర్థమవుతోంది. ఇటీవల వచ్చిన చాలా సినిమాలతో పోల్చితే… పేట మూవీ ట్రైలర్ లో రజినీ.. యాక్టివ్ గా, స్టైలిష్ గా కనిపిస్తున్నారు.

రజినీమార్క్ స్టైల్, డైలాగులు పేట మూవీలో చాలా ఉన్నాయంటోంది మూవీ యూనిట్. అనిరుధ్ ఈ మూవీకి సంగీతం అందించాడు. సన్ పిక్చర్స్ నిర్మాణంలో.. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో మల్టీస్టారర్ గా ఈ మూవీ తెరకెక్కింది.  విజయ్ సేతుపతి, నవాజుద్దీన్ సిద్ధిఖీ, త్రిష, సిమ్రన్, శశికుమార్, బాబీ సింహా ప్రధాన పాత్రలు పోషించారు.

Posted in Uncategorized

Latest Updates