రణరంగంగా తుత్తుకూడి : తమిళనాడులో పోలీస్ కాల్పులు

Tamil-Nadu-violentతమిళనాడు రాష్ట్రం తుత్తుకూడిలోని స్టెరిలైట్ కంపెనీ మూసి వేయాలంటూ 100 రోజులుగా జరుగుతున్న ఆందోళన మే 22వ తేదీ మంగళవారం హింసకి దారి తీసింది. స్టెరిలైట్ ఫ్యాక్టరీ వల్ల విపరీతమైన కాలుష్యత వస్తుందని.. వ్యర్థ పదార్థాలతో ఇబ్బంది పడుతున్నామని స్థానికులు కొన్నాళ్లుగా ఆందోళన చేస్తున్నారు. మంగళవారం 100వ రోజు సందర్భంగా.. వేలాది మంది ప్రజలు రోడ్లపైకి వచ్చారు. కంపెనీ ఎదుట బైఠాయించారు. పోలీసులు కూడా మోహరించారు. ఆందోళనకారులు – పోలీసుల మద్య ఘర్షణ జరిగింది. రెచ్చిపోయిన ఆందోళనకారులు పోలీస్ వాహనాలకు నిప్పుపెట్టారు. పోలీసులు కూడా ఫైరింగ్ ఓపెన్ చేశారు. ఈ కాల్పుల్లో ఇద్దరు చనిపోయారు.

తుత్తుకూడి ప్రస్తుతం రణరంగంగా మారింది. హింసాత్మక ఘటనలతో ఉద్రిక్తంగా మారింది. పోలీస్ కాల్పుల్లో ఇద్దరు చనిపోయారన్న వార్తలు నిమిషాల్లోనే అందరికీ చేరిపోయాయి. దీంతో మరింత రెచ్చిపోయారు ఆందోళనకారులు. ప్రభుత్వ,  ప్రైవేట్ వాహనాలు ధ్వంసం చేశారు.  ఆందోళనకారులకు కంట్రోల్ చేసేందుకు.. పోలీసులు లాఠీలకు పని చెప్పారు. దీంతో ఒక్కసారిగా రెచ్చిపోయారు. బాష్పవాయువు  ప్రయోగించి చెదరగొట్టారు. పదుల సంఖ్యలో ఆందోళనకారులు తీవ్రంగా గాయపడ్డారు.

తుత్తుకుడిలో ఆందోళనలు తమిళనాడు రాష్ట్రాన్ని కుదిపేస్తున్నాయి. ప్రభుత్వ తీరుకు నిరసనగా రాజకీయ పార్టీలు నిరసనలకు దిగాయి. ప్రజలను రెచ్చగొట్టే విధంగా ఆంక్షలు విధించి మరీ వారిపై దాడి చేయించారంటూ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు కూడా రంగంలోకి దిగారు. 144 సెక్షన్ విధించారు.

Posted in Uncategorized

Latest Updates