రత్నగిరి బీచ్ లో విషాదం: ఆరుగురు గల్లంతు

beachసమ్మర్ హాలీడే ఎంజాయ్ మెంట్ ఓ కుటుంబంలో విషాదం నింపింది. పూర్తిగా ఓ కుటుంబాన్ని తుడిచిపెట్టేసింది. మహారాష్ట్రలోని రత్నగిరి బీచ్ లో ఆరుగురు గల్లంతైన ఘటన తీవ్ర విషాదం నింపింది. సముద్రంలో  స్నానాలకు వెళ్లి ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు చనిపోయారు. కుటుంబంలో మొత్తం ఏడుగురు కాగా.. ఇద్దరు బీచ్ లో దిగకపోవడంతో ప్రాణాలతో బయటపడ్డారు. మృతులు కెన్నెత్ మాస్టర్, మోనికా బెంటో డిసౌజా, సనోమీ, రెచర్, మాథ్యూగా గుర్తించారు. మృతులంతా బీచ్ లోకి దిగిన కొన్ని నిమిషాల్లోనే వాతావరణం మారిపోయిందని.. లోతుకి వెళ్లడంతో పాటు అలల సునామీ కారణంగా సముద్రంలోకి కొట్టుకుపోయారని ప్రత్యక్ష సాక్షుల కథనం. మృతులంతా ముంబైలోని బోరీవాలీ ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు. నిజానికి రత్నగిరి బీచ్ ప్రమాదకరమైందని స్థానికులు చెప్పినా.. వినిపించుకోలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి.

Posted in Uncategorized

Latest Updates