రన్నింగ్ ట్రైన్ దిగబోయారు.. ఇద్దరు మహిళలను కాపాడిన పోలీసులు

రన్నింగ్ ట్రైన్ దిగొద్దు. అది చాలా డేంజర్. కానీ కొందరు తెలియక దిగుతుంటారు. ప్రాణాలమీదకు తెచ్చుకుంటుంటారు. మహారాష్ట్ర.. ముంబైలోని దాదర్ రైల్వే స్టేషన్ లో అలాంటి సంఘటనే జరిగింది.

రైల్వే స్టేషన్ లో రైలు కదిలింది. స్లో మూవ్ మెంట్ నుంచి.. స్పీడ్ అందుకుంది. అప్పుడే ఒకే బోగీ నుంచి ముగ్గురు మహిళలు ప్లాట్ ఫామ్ పైకి దిగబోయారు. ఓ మహిళ దిగీ దిగగానే… కింద పడిపోయింది. ప్లాట్ ఫామ్ పై ఉన్నవాళ్లు ఆమెను పైకి లేపారు. ఆమె వెనుకే మరో ఇద్దరు మహిళలు రన్నింగ్ ట్రైన్ దిగారు. అప్పటికే అలర్ట్ అయిన రైల్వే పోలీసులు.. వారిని రక్షించారు. రన్నింగ్ ట్రైన్ దిగి పడిపోయిన ఇద్దరు మహిళలు … ఆ వేగానికి ప్లాట్ ఫామ్ పైనుంచి మళ్లీ రైలు కిందపడిపోయేవారే. పోలీసులు వెంటనే వారిని పట్టుకుని… కదులుతున్న రైలుకు దూరంగా ఉంచారు. రైలు కదిలేటప్పుడు… జాగ్రత్తగా ఉండాలని… అస్సలు దిగొద్దని.. అత్యవసరమైతే చైన్ లాగాలని వారికి చెప్పారు.  ప్రాణాలు తిరిగి వచ్చినట్టుగా ఉందన్న ఆ మహిళలు పోలీసులకు థాంక్స్ చెప్పారు.

Posted in Uncategorized

Latest Updates