రన్ వేపై అదుపుతప్పిన విమానం

FLఫైలట్ చాకచక్యంగా వ్యవహరించడంతో 151 మంది ప్రాణాలు సేఫ్ అయ్యాయి. ఫ్లైట్ ఎగిరే సమయంలో ఇంజిన్ లో సమస్య రావడంతో ..రన్ వేపై అదుపుతప్పింది. దీంతో ఫైలట్ ఒక్క సారిగా కిందపడకుండా విమానం బ్యాలెన్స్ ను కంట్రోల్ చేయడంతో ..విమానంలో ప్రయాణిస్తున్న 151 మంది ప్రాణాలు సేఫ్ అయ్యాయి. ఈ సంఘటన సౌదీఅరేబియోలో మంగళవారం (మే-22) జరిగింది.

జెడ్డాలోని వెస్టర్న్ రెడ్ సీ సిటీలో  ఎయిర్ లైన్స్ కి చెందిన ఎయిర్‌ బస్ A330 హైడ్రాలిక్ విమానం యంత్రంలో సమస్య వచ్చింది.  రన్‌ వేపై ల్యాండింగ్ చేస్తున్న సమయంలో అదుపుతప్పింది. దీంతో రన్‌ వేపై మంటలు చెలరేగాయి. ప్రయాణికులను అత్యవసర మార్గం ద్వారా కాపాడే క్రమంలో 53 మందికి గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. విమానం 151 మంది ప్రయాణికులతో మెదీనా నుంచి ఢాకాకు వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. మొత్తానిక పెద్ద ప్రమాదం తప్పడంతో విమానంలో ఉన్న ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఫైలెట్ ని మెచ్చుకున్నారు ఎయిర్ పోర్ట్ అధికారులు.

 

 

Posted in Uncategorized

Latest Updates