రవాణా ఖర్చు దండగా : రూ.1కే కిలో ఉల్లిగడ్డ

నాసిక్ : ఉల్లి ధరలు మహారాష్ట్ర రైతులను నిలువెల్లా ముంచాయి. ఉల్లిగడ్డల ధరలు పడిపోవడంతో రైతులు కన్నీళ్లు పెడుతున్నారు. దేశంలోనే అతిపెద్ద ఉల్లి మార్కెట్  అయిన మహారాష్ట్రలోని లాసల్‌ గామ్ వ్యవసాయ మార్కెట్‌ లో రైతులు సోమవారం రూపాయికే కిలో ఉల్లిగడ్డలు అమ్మారు.

పొలాల నుంచి ఉల్లిగడ్డలను మార్కెట్ కు తీసుకువచ్చేందుకు అయిన రవాణ చార్జీలు కూడా రావడంలేదని రైతులు ఆవేదన చెందారు. ఉల్లి ధర తగ్గడంతో రైతులు గోదాముల్లో నిల్వ చేయాలని మార్కెట్ అధికారులు సూచిస్తున్నారు. పోయిన సంవత్సరం కూడా మహారాష్ట్రలో ఉల్లి ధరలు పడిపోయాయని తెలిపారు మార్కెట్ అధికారులు.

 

Posted in Uncategorized

Latest Updates