రవితేజ ‘నేలటిక్కెట్టు’ ట్రైలర్‌

RAVITEJAరవితేజ హీరోగా నటిస్తున్న సినిమా  నేలటిక్కెట్టు. ఈ సినిమా ట్రైలర్  బుధవారం(మే-16) రిలీజ్ అయ్యింది. ఎంత మంది కష్టాల్లో ఉన్నారో చూడరా.. కానీ సాయం చేసేవాడు ఒక్కడూ లేడు. ముసలితనం అంటే చేతకానితనం కాదురా. నిలువెత్తు అనుభవం అంటూ రవితేజ చెప్పే డైలాగ్స్ తో ఉన్న ట్రైలర్ ఎంతో ఎఫెక్టివ్ గా ఉంది. నా జీవితం, నా ఇష్టం రా.. నేను ఎదగడానికి ఎంత మందినైనా తొక్కేస్తాను’ అంటూ జగపతిబాబు తన విలనిజాన్ని చూపించారు.

కల్యాణ్‌ కృష్ణ దర్శకత్వ వహిస్తున్న ఈ సినిమాకు రామ్‌ తాళ్లూరి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మాళవిక శర్మ హీరోయిన్ గా నటిస్తుండగా..జగపతిబాబు, బ్రహ్మానందం, జయప్రకాశ్‌రెడ్డి, రఘుబాబు, అలీ, పోసాని కృష్ణ మురళి తదితరులు ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. శక్తికాంత్‌ కార్తీక్‌ మ్యూజిక్ అందించాడు.

Posted in Uncategorized

Latest Updates