రష్యా అధ్యక్షుడి విమానం విలువ రూ.3,534 కోట్లు


కొందరు దేశాధినేతలు ఉపయోగించే విమానాల విలువ అంచనాలకు మించి ఉంటున్నాయి. వారు ప్రయాణించే ఫ్లైట్లలో సకల సౌకర్యాలు ఉంటాయి. దీంతో కోట్లాది రూపాయలు ఖర్చు చేసి దేశాధినేతలు వినియోగించే విమానాలను సకల సధుపాయాలతో తయారు చేస్తారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇలీవల అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ను కలుసుకున్నారు. ఈ క్రమంలో పుతిన్ విమానానికి సంబంధించిన కొన్ని ఫొటోలు బయటకు వచ్చాయి. ఆయ‌న‌ వినియోగస్తున్న విమానం ఖరీదు రూ. 3,534 కోట్లు. దీనినిలో అడ్వాన్స్‌డ్ కమ్యూనికేషన్ సిస్టం ఉంది. ఈ విమానంలో ఆఫీసు, బెడ్ రూం, జిమ్ మొదలైన సౌకర్యాలున్నాయి. వివిధ భద్రతా కారణాల రీత్యా పుతిన్ ఒక్కోసారి ఒక్కో విమానాన్ని వినియోగిస్తుంటారు. పుతిన్ విమానానికి సంబంధించిన ఫొటోలు విడుదల కావడం రష్యాలో వివాదాస్పదంగా మారింది.

Posted in Uncategorized

Latest Updates