రష్యా ఓపెన్‌ : సౌరభ్ వర్మకు గోల్డ్

రష్యా ఓపెన్‌ BWF టూర్‌ వరల్డ్‌ సూపర్‌–100 టోర్నమెంట్‌ పురుషుల సింగిల్స్‌ టైటిల్‌ ను జాతీయ మాజీ చాంపియన్ సౌరభ్ వర్మ కైవసం చేసుకున్నాడు. ఆదివారం (జూలై-29) జరిగిన ఫైనల్లో జపాన్‌ కు చెందిన కోకి వటనబేపై సౌరభ్‌ విజయం సాధించి.. పసిడిని సొంతం చేసుకున్నాడు. ఫస్ట్ సెట్ 18-21తో కొల్పోయిన సౌరభ్‌.. ఆ తర్వాత తన అధిక్యాన్ని కనబరుస్తూ.. 21-12, 21-17లతో రెండు సెట్లను కైవసం చేసుకుని జయకేతనం ఎగరవేశాడు.
మిక్స్‌ డ్‌ డబుల్స్‌ ఫైనల్లో రోహన్‌ కపూర్‌–కుహూ గార్గ్‌ జోడీ రన్నరప్‌ గా నిలిచింది. వ్లాదిమిర్‌ ఇవనోవ్‌ (రష్యా)–మిన్‌ యుంగ్‌ కిమ్‌ (కొరియా) జోడితో జరిగిన మ్యాచ్‌ లో 19-21, 17-21తో వరుస సెట్లు కొల్పోవడంతో ఓటమి చవిచూసింది.

Posted in Uncategorized

Latest Updates