రష్యా-భారత్  సదస్సు: పుతిన్ తో మోడీ భేటీ

రష్యా అధ్యక్షుడు  వ్లాదిమిర్  పుతిన్ తో  తను  జరిపే  చర్చలు  భారత్-రష్యా  దేశాల మధ్య  వ్యూహాత్మక  భాగస్వామ్యానికి  మరింత  బలం  పెంచుతాయన్నారు ప్రధానమంత్రి  నరేంద్ర మోడీ.  అలా జరుగుతుందని  నమ్ముతున్నట్టు  ట్వీట్  చేశారు. రష్యన్,  ఇంగ్లిష్  భాషల్లో    ట్వీట్ చేశారు  మోడీ.  సోమవారం(మే-21) రష్యా వెళ్లిన మోడీ… సోచి  నగరంలో  పుతిన్ తో  అనధికారిక  సదస్సులో  పాల్గొంటారు.  భారత్ తో స్నేహపూర్వకంగా   ఉండే  రష్యా  ప్రజలకు  నమస్కారం  అంటూ  …మోడీ ట్వీట్ చేశారు.  పుతిన్ ను  ఎప్పుడు  కలుసుకున్నా… తనకు  సంతోషంగా  ఉంటుందన్నారు.

ఇరాన్  అణు ఒప్పందం  నుంచి  అమెరికా  తప్పుకోవడం,  ఉగ్రవాదం,  త్వరలో జరగనున్న  SCO,  బ్రిక్స్   సదస్సులు,  అంతర్జాతీయ  అంశాలపై   చర్చలుంటాయని సమాచారం.  రక్షణ రంగంలో  రష్యాపై  అమెరికా  ఆంక్షలపైనా  మాట్లాడే అవకాశముంది.  సోచి  టైమ్ ప్రకారం… మధ్యాహ్నం  ఒంటి  గంటకు  చర్చలు మొదలవుతాయి.  మోడీకి  పుతిన్  లంచ్  ఏర్పాటు చేశారు.  ఆఫ్ఘనిస్థాన్,  సిరియా పరిస్థితులపైనా  మోడీ-పుతిన్  మాట్లాడుకుంటారని  రష్యాలో  భారత అంబాసిడర్  పంకజ్ శరన్  తెలిపారు.  గత నెలలో  చైనా అధ్యక్షుడు… షీ జిన్ పింగ్ తోనూ… మోడీ అనధికారిక  సదస్సులో  పాల్గొన్నారు.  మోడీ  రష్యా  వెళ్లడం  ఇది  మూడోసారి. 2015లో  బ్రిక్స్ సదస్సు  కోసం, 2017లో …18వ  రష్యా-భారత్  సదస్సు కోసం  మోడీ  రష్యాలో  పర్యటించారు.

 

Posted in Uncategorized

Latest Updates