రహదారి  భద్రతపై దృష్టి పెట్టండి

jitendarreddyకేంద్రానికి జితేందర్ రెడ్డి వినతి

రహదారి  భద్రతపై  కేంద్ర ప్రభుత్వం  మరింతగా  దృష్టిపెట్టాలని  కోరారు  టీఆర్ఎస్  లోక్ సభా పక్ష  నేత జితేందర్ రెడ్డి.  లోక్ సభ  ప్రశ్నోత్తరాల్లో  జితేందర్ రెడ్డి మాట్లాడుతూ  రోడ్డు ప్రమాదాలు  తగ్గుతున్నాయని  కేంద్రం చెప్పడం  కరెక్ట్  కాదన్నారు.  రోడ్ సేఫ్టీ లేకపోవడంతో మరణాలు  పెరుగుతున్నాయని చెప్పారు జితేందర్ రెడ్డి .  రోడ్ల అభివృద్ధి  కంటే …కాంట్రాక్టర్ల సంక్షేమంపైనే  కేంద్రం  దృష్టి  పెట్టినట్టుగా  అనిపిస్తోందన్నారు ఆయన.  స్పందించిన  కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ..  ప్రమాదాలు తగ్గించేందుకు  ప్రణాళికతో  పనిచేస్తున్నామని.. అవగాహన కార్యక్రమాలు  నిర్వహిస్తున్నామన్నారు.

Posted in Uncategorized

Latest Updates