రాం గోపాల్ వర్మ విచారణ వాయిదా

220px-Ram_Gopal_Varma-BJPGST వెబ్ సినిమాతో పాటు…అభ్యంతరకర కామెంట్ల కేసులో రామ్ గోపాల్ వర్మ విచారణ వాయిదా పడింది. పక్కాగా ఆధారాలు సేకరిస్తున్న పోలీసులు… సాంకేతిక ఆధారాలు లభించిన తర్వాతే వర్మను మళ్లీ విచారణకు పిలవాలని భావిస్తున్నారు. శుక్రవారం (ఫిబ్రవరి-23) విచారణకు రావొద్దని… మళ్లీ విచారణ తేదీని తర్వాత చెబుతామని RGVకి సమాచారమిచ్చారు పోలీసులు. ఆయన నుంచి స్వాధీనం చేసుకున్న ల్యాప్ టాప్ లోని డేటాను రెండు సైబర్ క్రైమ్ బృందాలు అనాలసిస్ చేస్తున్నాయి. ఎక్కడ సినిమాను అప్ లోడ్ చేశారు, ఎక్కడ షూటింగ్ చేశారనే సమాచారంపై ఆధారాలు సేకరిస్తున్నారు. పక్కా ఆధారాలు కలెక్ట్ చేశాక వర్మను మళ్లీ పిలుస్తామంటున్నారు పోలీసులు.

Posted in Uncategorized

Latest Updates