రాకెట్ కేంద్రంలో ‘’జీరో’’ యాక్టింగ్

sharu-jfgdfs-nహీరో షారూఖ్ సరసన అనుష్మ శర్మ, కత్రినా కైఫ్ కథానాయికలుగా నటిస్తున్న చిత్రం జీరో. ఈ చిత్రానికి ఆనంద్ ఎల్. రాయ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో షారూఖ్ మరుగుజ్జుగా కనిపించనున్నాడు. ఈ ఏడాది డిసెంబర్ 21న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తేనున్నారు. ఇటీవ‌ల చిత్రానికి సంబంధిచి ప‌లు ఫోటోలు బ‌య‌ట‌కి రాగా, అవి అభిమానుల‌లో ఆస‌క్తిని క‌లిగించాయి. అయితే ఇప్పుడు సినీ ల‌వ‌ర్స్‌ని ఆశ్చ‌ర్య‌ప‌రిచే వార్త ఒక‌టి బ‌య‌ట‌కి వ‌చ్చింది. జీరో చిత్రానికి సంబంధించిన కొన్ని స‌న్నివేశాల‌ను అమెరికాలోని అలాబమాలో ఉన్న అంతరిక్ష, రాకెట్‌ కేంద్రంలో తెరకెక్కించాలని, చిత్రీక‌ర‌ణ అనుమ‌తి కోసం ముంబైలోని అమెరికా కాన్సులేట్‌ కార్యాలయంలోఅనుష్క‌, షారూఖ్ ఖాన్‌ అధికారుల‌తో కొద్ది సేపు చ‌ర్చించారు. రాకెట్ కేంద్రంలో చిత్రీక‌ర‌ణ‌కి అనుమ‌తి ల‌భించ‌డంతో వారు హ్యాపీగా ఫీల‌య్యారు. త్వ‌ర‌లో అమెరికా ఫ్లైట్ ఎక్కేందుకు సిద్ధ‌మ‌వుతుంది చిత్ర యూనిట్‌. చిత్రంలో సూపర్‌స్టార్‌ పాత్ర పోషిస్తున్నారు కత్రినా. ఆమె ప్రేమను గెలుచుకోవాలని షారుక్‌ ప్రయత్నిస్తుంటారు. మరోపక్క అనుష్క మానసిక దివ్యాంగురాలి పాత్రలో కన్పించనున్నారు.

Posted in Uncategorized

Latest Updates