రాఘవేంద్రమఠంలో రజనీ పూజలు

rajani-11త‌మిళ సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ త్వ‌ర‌లో రాజ‌కీయారంగేట్రం చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. త‌మ పార్టీ శాసన సభ ఎన్నికల్లో 234 నియోజక వర్గాల్లోనూ పోటీ చేస్తుందని ర‌జ‌నీ ఇటీవ‌ల‌ ప్రక‌టించాడు. ప్ర‌స్తుతం పార్టీకి సంబంధించి క‌స‌రత్తులు చేస్తున్న ర‌జ‌నీకాంత్ , ఆదివారం (ఫిబ్రవరి-18) చెన్నైలోని శ్రీ రాఘ‌వేంద్ర‌మ‌ఠ్‌లో పూజ‌లు నిర్వ‌హించారు. స్వామి వారి ఆశీస్సులు తీసుకున్న ర‌జ‌నీ, ఈ రెండు మూడురోజుల‌లో పార్టీ ప్ర‌క‌ట‌న చేస్తాడా అని కోలీవుడ్ తంబీలు ముచ్చ‌టించుకున్నారు. మ‌రోవైపు కాలా సినిమాతోను బిజీగా ఉన్న తలైవా ఈ మూవీని ఏప్రిల్ 27న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్నారు. ఈ మూవీ విడుద‌లైన కొన్నిరోజుల‌కే శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ర‌జ‌నీకాంత్‌, అక్ష‌య్ కుమార్‌, అమీ జాక్స‌న్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో తెర‌కెక్కిన 2.0 సినిమా విడుద‌ల కానుంది.

Posted in Uncategorized

Latest Updates