రాజకీయాలతో సంబంధం లేదు : కశ్మీర్ లో టెర్రర్ ఆపరేషన్ కొనసాగిస్తామన్న ఆర్మీ చీఫ్

ARMYరంజాన్ మాసం  కారణంగా  టెర్రర్ ఆపరేషన్ కు  గ్యాప్ ఇచ్చామని..  మళ్లీ  మొదలు  పెడతామన్నారు  ఆర్మీ చీఫ్  బిపిన్ రావత్. జమ్మూ-కశ్మీర్ లో  ఏర్పడిన  రాజకీయ సంక్షోభంతో  ఆర్మీకి సంబంధం  లేదని… అసలు తమపై  రాజకీయ ఒత్తిడి ఉండదన్నారు.  దేశ రక్షణ,  సరిహద్దు భద్రతనే  తమ లక్ష్యమన్నారు  రావత్. అంతకుముందు  ఉగ్రవాద  కార్యకలాపాలతో గాయపడి  దేశసేవకు  దూరమైన  జవాన్ల కోసం …ఓ కార్యక్రమం ఏర్పాటు  చేశారు. దానికి  హాజరై  మంచానికే పరిమితమైన  మాజీ సైనికుల్లో  స్థైర్యం నింపే  ప్రయత్నం చేశారు  ఆర్మీ చీఫ్. వాళ్లను  కాపాడుకోవడం  తమ బాధ్యత అన్నారు.

Posted in Uncategorized

Latest Updates