రాజకీయాల్లోకి కపిల్ దేవ్ : రాష్ట్రపతి కోటాలో రాజ్యసభకు

amit-shah_kapildevక్రికెట్ లెజండరీ.. ఫస్ట్ టైం భారతదేశానికి వాల్డ్ కప్ తీసుకొచ్చిన కెప్టెన్ కపిల్ దేవ్. కూల్ కెప్టెన్.. తన పని తాను చేసుకుపోతూ.. కాంట్రవర్సీలకు దూరంగా ఉండే కపిల్ దేవ్ పొలిటికల్ ఎంట్రీ షూరూ అయ్యింది. అధికారికంగా ఏ పార్టీలోనూ సభ్యత్వం తీసుకోకపోయినా.. పరోక్షంగా బీజేపీకి సపోర్ట్ చేయనున్నట్లు జాతీయ పత్రికలు కోడై కూస్తున్నాయి. ఇందుకు బలం చేకూర్చుతూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా.. స్వయంగా తానే కపిల్ దేవ్ ఇంటికి వెళ్లి భేటీ అయ్యారు. సుమారు గంటసేపు చర్చించారు.

కేంద్ర ప్రభుత్వం నాలుగేళ్ల పాలనపై దేశవ్యాప్తంగా బీజేపీ నేతలు సెలబ్రిటీలను కలుస్తూ ఉన్నారు. ఇందులో భాగంగానే కపిల్ తోనూ భేటీ అయినా.. ఆయన్ను మాత్రం రాజకీయాల్లోకి రావాలని ఆహ్వానించినట్లు సమాచారం. మోడీకి మద్దతుగా నిలవాలని కోరారు. అంతే కాకుండా రాష్ట్రపతి నామినేటెడ్ చేసే రాజ్యసభ్య సభ్యుల జాబితాలో కపిల్ దేవ్ కు చోటు దక్కనున్నట్లు తెలుస్తోంది. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లోనే కపిల్ దేవ్ తో ప్రమాణస్వీకారం చేయించాలని కూడా నిర్ణయించారు. ఈ మేరకు అమిత్ షా కూడా హామీ ఇచ్చినట్లు జాతీయ పత్రికల్లో కథనాలు వస్తున్నాయి. రాష్ట్రపతి నామినేటెడ్ చేసే రాజ్యసభ ఎంపీల్లో కపిల్ దేవ్ ఎంపిక అయినా.. పరోక్షంగా బీజేపీకి మద్దతు ఇచ్చినట్లే కదా అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇటీవలే క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ పదవీ కాలం ముగిసింది. ఇప్పుడు మరో లెజండరీ క్రికెటర్ ఎంపిక కానుంది.

Posted in Uncategorized

Latest Updates