రాజకీయాల్లోకి రా: అశోక్ బాబు కు సీఎం చంద్రబాబు ఆహ్వానం

chandrababu-ashok-babuAPNGO నేత అశోక్ బాబును రాజకీయాల్లోకి రావాలన్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.సమైక్యాంధ్ర ఉద్యమంలో కీలక పాత్ర వహించారని.. విజయవాడ బెంజ్ సర్కిల్ దగ్గర నిర్వహించిన నవనిర్మాణ దీక్షా వేదికపై ఆయనకు.. సీఎం ఈ ఆహ్వానం పలికారు. వచ్చే ఏడాది ఏడాదిలోఅశోక్ బాబు రిటైరవుతున్నారని… కాబట్టి రాజకీయాల్లోకి రమ్మని ఆయనను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఉద్యోగులు చేసిన పోరాటం ఎవరూ మరువలేరని.. అదే నిబద్ధతతో ప్రజాజీవితంలోకి అడుగుపెట్టాలని అశోక్ బాబుకు సూచించారు. ఆయన ఎప్పుడు వచ్చినా తాము సిద్ధంగా ఉంటామంటూ పరోక్షంగా తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు.

తిరుమల ఆలయంలో వజ్రం పోయిందంటున్నారని, ఈ విషయంలో సీబీఐ విచారణ పేరుతో అప్రతిష్టపాలు చేయాలనుకుంటున్నారని ఆయన చెప్పుకొచ్చారు. సాక్షాత్తు వేంకటేశ్వరస్వామిని కూడా తానే కాపాడతానని చెప్పారు సీఎం చంద్రబాబు.

 

Posted in Uncategorized

Latest Updates