రాజకీయాల్లోకి వస్తే మూడో ప్రపంచ యుద్ధమే: ఇంద్రానూయి

న్యూయార్క్ : తాను రాజకీయాల్లోకి వస్తే మూడో ప్రపంచ యుద్ధం వస్తుంది.. రాజకీయాలు తనకు సరిపడవన్నారు పెప్సికో మాజీ సీఈవో ఇంద్రానూయి. ఆసియా ఖండం గురించి ప్రపంచ దేశాల్లో చైతన్యం కలిగించే ఓ సంస్థ ఆమెకు ‘గేమ్‌ ఛేంజర్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ అవార్డును అందించింది. ఈ సందర్భంగా పెప్సికో సీఈవో బాధ్యతల నుంచి తప్పుకున్న తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించి ట్రంప్‌ మంత్రివర్గంలో పనిచేయొచ్చు కదా..అన్న ప్రశ్నకు సమాధానమిచ్చారు. నాకూ రాజకీయాలకూ సరిపడదని. దాపరికం లేకుండా మాట్లాడతానన్నారు. రాజకీయాల్లోకి వస్తే మూడో ప్రపంచ యుద్ధమే వస్తుందంటూ చమత్కరించారు ఇంద్రానూయి.

పెప్సికో సీఈవో బాధ్యతల నుంచి తప్పుకొనేటప్పుడు చాలా కష్టంగా అన్పించిందన్నారు. గత 40 ఏళ్లుగా ఉదయాన్నే 4 గంటలకు నిద్రలేచి రోజంతా 18 నుంచి 20 గంటల పాటు ఉత్సాహంగా పనిచేసేదాన్నని తెలిపారు. ఇప్పుడు నాకు విశ్రాంతి దొరికింది. రోజుకు కనీసం 6 గంటలు ఏకధాటిగా నిద్రపోవడం ఎలా అనే విషయాన్ని నేర్చుకోవాలన్నారు ఇంద్రానూయి.

 

 

Posted in Uncategorized

Latest Updates