రాజకీయాల్లో విశ్వరూపం : సినిమాలకు కమల్ గుడ్ బై

kamal-hassan-filmsసినీ లెజెండ్ యాక్టర్ కమలహాసన్ సంచలన నిర్ణయం ప్రకటించారు. సినిమాలకు గుడ్ బై చెప్పారు. ఇప్పటికే నిర్మాణంలో ఉన్న రెండు సినిమాలను పూర్తి చేసిన తర్వాత.. ఇక సినిమాలు చేసేది లేదని స్పష్టం చేశారు. సినీ జీవితం నుంచి రాజకీయాల్లోకి వస్తున్నానని.. మిగతా జీవితం అంతా ప్రజల కోసమే అని ప్రకటించారు. ప్రస్తుతం అమెరికాలోని బోస్టన్ లోని ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. హీరో ప్రకటనతో.. కమల్ అభిమానులు షాక్ అయ్యారు.

ఈ నెలలోనే (ఫిబ్రవరి) పార్టీ పేరు, విధివిధానాలను ప్రకటించనున్నట్లు తెలిపారు. నటుడిగానే చ‌నిపోవ‌డానికి ఇష్ట‌ప‌డ‌టం లేదన్నారు. ప్ర‌జాసేవ చేసిన త‌ర్వాతే తుది శ్వాస విడుస్తా అంటున్నారు ఈ విశ్వవిఖ్యాత నటుడు. అందుకే రాజ‌కీయాల‌పైనే పూర్తి దృష్టి పెట్టినట్లు తెలిపారు. ప్ర‌జ‌లు నిజాయితీగా బ‌తికేందుకు ఏదో ఒక‌టి చేయాల‌ని భావిస్తున్నాను అన్నారు. 37 ఏళ్లుగా ప్ర‌జా జీవితంలో ఉన్నాను. ఈ 37 సంవ‌త్స‌రాల్లో 10 ల‌క్ష‌ల మంది నిజాయితీప‌రులైన ప‌నిమంతుల‌ను క‌లుసుకున్నాను.. 37 ఏళ్లుగా వారు నాతోనే ఉన్నారని చెప్పారు. బ్యాంక్‌లోని నా అకౌంట్‌లో డ‌బ్బులు వేసుకోవ‌డానికి నేను రాజ‌కీయాల్లోకి రాలేదు.. రాజకీయాల్లోకి రావాల‌ని ప‌దేళ్ల క్రిత‌మే నిర్ణ‌యం తీసుకున్న‌ా అని క‌మ‌ల్ వెల్లడించారు.

Posted in Uncategorized

Latest Updates