రాజకీయ లబ్ది కోసం దీక్ష చేయలేదు…ప్రజల బాగే జనసేన బాగు : పవన్

MAHIరాజకీయ లబ్ది కోసం తాను దీక్ష చేయలేదన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.  ఉద్దానం బాధితుల కోసం ఒక్కరోజు దీక్ష చేసిన పవన్…న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతుందన్నారు. రాష్ట్రంలో పారిశ్రామిత వేత్తలను సమావేశపరిచి…కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద ఉద్దానం సమస్యను పరిష్కరించవచ్చన్నారు.

ఉద్దానం వెనుకబడ్డ ప్రాంతం కాదని…వెనక్కి నెట్టబడిన ప్రాంతమన్నారు….జనసేన అధినేత పవన్ కల్యాణ్. కిడ్నీ బాధితుల సమస్యలపై సర్కార్ స్పందించకపోవటంతో.. నిన్న సాయంత్రం దీక్షకు దిగిన పవన్..ఇవాళ సాయంత్రం విరమించారు. పనవ్ కల్యాణ్ కు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింప చేశారు ఉద్దానం కిడ్నీ బాధితులు. మరోవైపు పవన్ దీక్షకు AP సీపీఎం నేతలు మద్దతు తెలిపారు. తాను దీక్ష చేసింది రాజకీయ లబ్దికోసం కాదన్న జనసేన అధినేత…ప్రజల బాగే…జనసేన బాగు అన్నారు. రాజకీయ లబ్ధి పొందాలంటే..చంద్రబాబుకు మద్దతు ఇచ్చేవాడిని కాదన్నారు. రెండు వేల కోట్లు పుష్కరాలకు ఖర్చుపెట్టిన ఏపీ ప్రభుత్వం…జబ్బుతో 20 వేల మంది చనిపోతే పట్టించుకోలేదని విమర్శించారు పవన్.

రాష్ట్రాన్ని మోసం చేసిన కేంద్రం…ఆ కేంద్రానికి మద్దతిచ్చిన తెలుగుదేశంపై నిరసనగా ఆందోళన చేశామన్నారు పవన్ కల్యాణ్. సామాజిక రాజకీయ చైతన్యం కోసం జనసేన పార్టీ ఎన్నికల్లో పోటీ చేస్తుందన్నారు. ఉద్దానం బాధితులకు న్యాయం జరిగేవరకు జనసేన పోరాటం కొనసాగుతుందన్నారు పవన్ కల్యాణ్.

 

Posted in Uncategorized

Latest Updates