రాజధాని కేంద్రంగా క్లోన్డ్ కార్డుల దందా

ATMఢిల్లీ కేంద్రంగా అనేక మంది క్రెడిట్, డెబిట్ కార్డు వినియోగదారుల డేటా క్లోనింగ్ జరిగింది. దీని ఆధారంగా క్లోన్డ్ కార్డులు తయారు చేసిన అంతరాష్ట్ర ముఠా దేశంలోని అనేక నగరాల్లోని ఏటీఎంల నుంచి డబ్బు డ్రా చేయించింది. గత నాలుగు రోజుల్లో ఆరు కేసులు నమోదయ్యాయి. దీనితో ఢిల్లీ యూనివర్సిటీలోని ఓ ప్రొఫెసర్ కు చెందిన కోన్డ్ కార్డు హైదరాబాద్ లో ఉపయోగించి 50 వేల రూపాయలు డ్రా చేసినట్లు గుర్తించారు పోలీసులు. ఢిల్లీ నుంచి ఓ ప్రత్యేక బృందాన్ని దర్యాప్తు కోసం హైదరాబాద్ కు పంపించారు. ఏ ATM కేంద్రం నుంచి డబ్బులు డ్రా చేశారో…ఆ కేంద్రంలోని సీసీ కెమెరా ఫీడ్ సంగ్రహించాలని, దీని ద్వారా ముఠా సభ్యుల వివరాలు సేకరించాలని భావిస్తున్నారు ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక పోలీసులు.

ఈ ముఠా సభ్యులు ఇంటర్ నెట్ ద్వారానే మాగ్నటిక్ స్ట్రిప్ తో కూడిన ఖాళీ కార్డులను ల్యాప్ టాప్ కు అనుసంధానించి క్లోన్డ్ కార్డు రూపొందించారు. ఈ విధంగా రూపొందించిన నకలు క్రెడిట్ కార్డుకు పిన్ నెంబర్లు ఏజెంట్ల ద్వారా చేరిపోతాయి. ఈ క్లోన్డ్ కార్డులతోపాటు దానికి సంబంధించిన పిన్ ను ఏజెంట్లు హైదరాబాద్ సహా దేశంలోని ప్రధాన నగరాల్లో ఉన్న దళారులకు అందిస్తున్నారు. దళారులు ఆ కార్డులను వినియోగించి డబ్బు డ్రా చేసి 20 శాతం కమీషన్ మినహాయించుకొని, మిగిలిన 80 శాతం డబ్బు సూత్రదారులకు పంపిస్తున్నారు.

Posted in Uncategorized

Latest Updates