రాజమౌళి చెప్పిన రానా పెళ్లి సంగతి

టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్స్ ప్రభాస్,రానా పెళ్లిళ్ల పై ప్రముఖ డైరెక్టర్ ఎస్ఎస్.రాజమౌళి ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారట. రీసెంట్ గా ఈ ముగ్గురు బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ ‘కాఫీ విత్ కరణ్’ షోలో పాల్గొన్నారు. ఈ షోలో ప్రభాస్,రానాను వారి పర్సనల్ లైఫ్ తో పాటు మ్యారేజ్ గురించి కరణ్ క్వశ్చన్  చేయగా.. జక్కన్న  మధ్యలో కల్పించుకొని తన ఆన్సర్ తో వారందరినీ సర్ ప్రైజ్ చేసినట్లు టాక్.

రానా.. ప్రభాస్ కన్నా ముందే పెళ్లి చేసుకుంటాడని రాజమౌళి చెప్పినట్లు తెలుస్తోంది. మరో ప్రశ్నకు సమాధానంగా తనకు బద్ధకం ఎక్కువని, అదే తన బలహీనత అని ప్రభాస్ చెప్పారట. కాఫీ విత్ కరణ్ షో ఇప్పటికే ఐదు సీజన్లను కంప్లీట్ చేసుకుంది. ప్రస్తుతం ఈ షో ఆరో సీజన్ కొనసాగుతోంది. ప్రభాస్,రానా,రాజమౌళి పాల్గొన్న ఈ షో ఎపిసోడ్ త్వరలోనే టెలికాస్ట్ కానుంది.

 

Posted in Uncategorized

Latest Updates