రాజశ్యామల ఆలయంలో కేసీఆర్ ప్రత్యేక పూజలు

రాష్ట్రాల పర్యటనలో భాగంగా….విశాఖకు చేరుకున్నారు సీఎం కేసీఆర్.హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం నుంచి కుటుంబ సభ్యులతో కలిసి…ప్రత్యేక విమానంలో విశాఖకు వెళ్లారు. ఎయిర్ పోర్టుకు చేరుకున్న కేసీఆర్ కు అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. ఆ తర్వాత విశాఖ శారదా పీఠానికి వెళ్లిన సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులు, రాజశ్యామల ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శారదా పీఠాధిపతి స్వరూపానంద స్వామి అశీస్సులు తీసుకున్నారు.

కేసీఆర్ విశాఖ పర్యటన సందర్భంగా శారదాపీఠం దగ్గర కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎయిర్ పోర్టు నుంచి శారదాపీఠం వరకు…రోడ్డు మార్గంలో భారీగా పోలీసులు మొహరించారు. మరోవైపు కేసీఆర్ టూర్ సందర్భంగా స్వాగతం పలుకుతూ విశాఖ విమానాశ్రయం నుంచి శారదాపీఠం వెళ్లే మార్గంలో భారీ కటౌట్లు, ప్లేక్సీలు ఏర్పాట్లు చేశారు అభిమానులు.

Posted in Uncategorized

Latest Updates