రాజస్తాన్ లో ముగిసిన పోలింగ్.. 72.7 శాతంగా నమోదు

 రాజస్తాన్ లో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం 199 నియోజకవర్గాల్లో పోలింగ్ జరిగింది. ఉదయం 8 గంటలకు మొదలైన పోలింగ్.. సాయంత్రం 5 గంటలకు ముగిసింది. ఈ ఎన్నికల్లో 72.7 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద లైన్లో నిలబడినవారు తమ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంది. అత్యధికంగా పోఖ్రాన్‌ జిల్లాలో 71.29శాతం, జైసల్మేర్‌లో 70.31 శాతం పోలింగ్‌ నమోదైనట్లు అధికారులు తెలిపారు. రాజస్థాన్‌లో మొత్తం 200 స్థానాలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా.. రామ్‌గఢ్‌ ఎమ్మెల్యే అభ్యర్థి మృతితో 199 స్థానాలకు పోలింగ్‌ జరిగింది.  ప్రభుత్వ ఏర్పాటుకు 100 సీట్లు అవసరం ఉంది. డిసెంబరు 11న ఫలితాలు వెలువడనున్నాయి.

Posted in Uncategorized

Latest Updates