రాజస్థాన్ లోనూ ఇవాళే పోలింగ్

తెలంగాణతో పాటు రాజస్థాన్ కూడా ఎన్నికలకు సిద్ధమైంది. ఇవాళ(శుక్రవారం) పోలింగ్ కు సంబంధించి అన్ని ఏర్పాట్లను ఎన్నికల సంఘం పూర్తి చేసింది. ఉదయం 8 గంటల నుంచి 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. 199 అసెంబ్లీ స్థానాలకు 2,274 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు. రాజస్థాన్ లో మొత్తం 200 సీట్లు ఉన్నా అల్వార్ జిల్లాలోని రామ్ గఢ్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థి లక్ష్మణ్ సింగ్ మరణంతో అక్కడ ఎన్నిక వాయిదా పడింది.

పోలింగ్ కోసం 51,687 బూత్ లను ఈసీ ఏర్పాటు చేసింది. వాటిలో 259 బూత్ లను మొత్తంగా మహిళా సిబ్బందే నిర్వహించనున్నారు. 13,182 బూత్ లను సమస్యాత్మకంగా గుర్తించిన ఈసీ గట్టి భద్రత ఏర్పాటు చేసింది.సుమారు 4.74 కోట్ల మంది రాజస్థానీలు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వారిలో 2.27 కోట్ల మంది మహిళలున్నారు. తొలిసారి 20 లక్షల మంది ఓటు వేయబోతున్నారు.

Posted in Uncategorized

Latest Updates