రాజస్థాన్ లో రోడ్డు పైనే పోస్ట్  మార్టం

రాజస్థాన్ లోని బర్మేర్ జిల్లాలో ఇద్దరు మహిళల మృతదేహాలకు రోడ్డు పైనే పోస్ట్ మార్టం చేయడం కలకలం సృష్టించింది.  బర్మేర్ జిల్లాలోని గడారా రోడ్ లో నివాసం ఉంటున్న మయా కన్వార్ అనే మహిళ ఇంటి డాబా మీద బట్టలు ఆరబెడుతుండగా ఒక్కసారి పైన ఉన్న విద్యుత్ తీగలు తగిలాయి. ఆమె కేకలు విన్న  అత్త రాజాదేవి, మామ పదం సింగ్… ఆమెను కాపాడేందుకు ప్రయత్నించగా వారు కూడా షాక్ కు గురయ్యారు. హుటాహుటిన వారిని స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కు తీసుకెళ్లగా.. అత్త,కోడళ్ళిద్దరూ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన పదం సింగ్ కు చికిత్స అందిస్తున్నారు. మృతదేహాలను హాస్పటల్ లో ఉంచగా అక్కడ ఉన్న పేషేంట్లు అభ్యంతరం తెలిపారు. అయితే 100 కిలోమీటర్ల దూరంలో మార్చురీ సౌకర్యం లేకపోవడంతో కుటుంబ సభ్యులు,పోలీసుల విజ్ఞ‌ప్తి మేరకు  వారి మృతదేహాలకు వైద్యులు రోడ్డు పైనే పోస్ట్ మార్టం నిర్వహించారని.. అక్కడి హెల్త్ అధికారి తెలిపారు.

Posted in Uncategorized

Latest Updates