రాజస్థాన్ సీఎంగా అశోక్ గెహ్లాట్ ?

ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. ఇప్పుడు ఆయా రాష్ట్రాల్లో కొత్త సీఎంలు ఎవరనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక రాజస్థాన్ ఎన్నికల్లో  విజయం సాధించిన కాంగ్రెస్.. ప్రభుత్వ ఏర్పాటు పై దృష్టి సారించింది. 199 స్థానాలకు రాజస్థాన్‌లో పోటీ జరగ్గా కాంగ్రెస్‌ పార్టీ 99 స్థానాల్లో, దాని మిత్రపక్షమైన ఆర్‌ఎల్‌డీ పార్టీ ఒక చోట గెలుపొందాయి. దీంతో కాంగ్రెస్‌ కూటమి 100 స్థానాలతో మ్యాజిక్‌ ఫిగర్‌ను చేరుకుంది.

రాజస్థాన్‌లో సీఎం పదవి కోసం కాంగ్రెస్ తరపున సీనియర్ లీడర్ అశోక్‌గెహ్లాట్, యువ నేత సచిన్‌పైలెట్ బరిలో ఉన్నారు. అయితే సీఎం పదవి ఎక్కువగా అశోక్ గెహ్లాట్ కే వచ్చే అవకాశాలు ఉన్నాయని టాక్. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తుండటంతో గెహ్లాట్ అయితేనే ఆ ఎన్నికలను సమర్ధవంతంగా నడిపిస్తారని కాంగ్రెస్ హై కమాండ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. సర్వేల్లో కూడా జనం గెహ్లాట్ కే జై కట్టారు. ఆయన సిఎం అయితేనే బాగుంటుందని చాలా మంది అభిప్రాయపడ్డారు. అయితే టఫ్ టైంలో రాజస్థాన్ లో కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన యువ నేత సచిన్ పైలెట్ కాంగ్రెస్ విజయంలో కీ రోల్ ప్లే చేశారు. సచిన్ పైలెట్.. కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడిగా పేరొందడం ఆయనకు కలిసొచ్చే అంశంగా పొలిటికల్ ఎక్స్ పర్ట్స్ భావిస్తున్నారు.

అయితే ఇవాళ(డిసెంబర్ 12) కాంగ్రెస్ నుంచి గెలిచిన కొంత మంది ఎమ్మెల్యేలతో పాటు పార్టీ రెబెల్స్ జైపూర్ లోని అశోక్ గెహ్లాట్ నివాసానికి వెళ్లి ఆయనతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇండిపెంట్ అభ్యర్ధులు కాంతిలాల్,రామ్ కేష్ మీనా మాట్లాడుతూ సీఎం అభ్యర్ధిగా అశోక్ గెహ్లాట్ ఉంటేనే తాము కాంగ్రెస్ కు మద్దతు ఇస్తామన్నారు. గెహ్లాట్ ప్రజానాయకుడని తామంతా ఆయనతో ఉంటామన్నారు. గెహ్లాట్ ఒక్కరే సిఎం పోస్టుకు అర్హుడని చెప్పారు. దీంతో ఇద్దరిలో ఎవరు సీఎం అవుతురానే విషయం ఇంట్రస్టింగ్ గా మారింది.

 

Posted in Uncategorized

Latest Updates