రాజస్థాన్ సీఎం గా అశోక్ గెహ్లాట్

మొత్తానికి రాజస్థాన్ సీఎం ఎవరన్న సస్పెన్స్ కు తెరపడింది. రెండు రోజుల పాటు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ సుదీర్ఘ మంతనాలు, సంప్రదింపుల తర్వాత సీఎం పదవి కోసం పోటీ పడుతున్న అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ ల మధ్య రాజీ కుదిర్చారు. అనుభవానికే పెద్ద పీట వేసి గెహ్లాట్ ను సీఎంగా ఎంపిక చేశారు. సచిన్ పైలట్ డిప్యూటీ సీఎంతో సరిపెట్టుకున్నారు. అయితే రాజస్థాన్ పీసీసీ చీఫ్ గా సచిన్ పైలట్ కొనసాగుతారు.

రాజస్థాన్‌ సీఎం పదవికి గెహ్లాట్ తో పాటు యువ నేత సచిన్‌ పైలట్‌ కూడా పోటీపడ్డారు. వీరిలో ఎవరిని ఎంపిక చేయాలన్నదానిపై పార్టీ గత మూడు రోజులుగా చర్చలు నిర్వహించింది. రాష్ట్రానికి వెళ్లిన ఏఐసీసీ పరిశీలకుడు కేసీ వేణుగోపాల్‌ సహా ఇతర సీనియర్‌ నేతలతో కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ గురువారం నుంచి విస్తృత స్థాయిలో చర్చలు జరిపారు. అటు గెహ్లాట్, పైలట్‌లతోనూ అనేక సార్లు మాట్లాడారు. ఇవాళ(శుక్రవారం) మరోసారి చర్చలు జరిపిన తర్వాత చివరగా గెహ్లాట్ పేరును ఖరారు చేశారు.

Posted in Uncategorized

Latest Updates