రాజస్ధాన్ లో ఘోర రోడ్డు ప్రమాదం… ఆరుగురు మృతి

BUSరాజస్థాన్‌ లో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో అజ్మీర్ వైపు బస్సు వెళ్లుండగా ఎదురుగా వస్తోన్న ట్రక్‌ను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడిక్కడే చనిపోయారు. 21 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ట్రీట్ మెంట్ కోసం ఆస్పత్రికి తరలించారు. అతివేగమే ప్రమాదానికి కారణంగా పోలీసుల ప్రాధమిక దర్యాప్తులో తేలింది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Posted in Uncategorized

Latest Updates