రాజీనామాలు అంటూ కోమటిరెడ్డి ఫిటింగ్ : చర్చించిన తర్వాతే అంటూ జానా ఆయింట్ మెంట్

jana
కాంగ్రెస్  పార్టీలో  ఎమ్మెల్యేల  బహిష్కరణ  వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. కోర్టు ఆదేశాల తర్వాత జోష్ వచ్చింది. ఇదే ఊపులో అందరూ  రాజీనామాలు చేయాలంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి డిమాండ్ చేయటం కలకలం రేపింది. హైకోర్టు బెంచ్ నిర్ణయం తర్వాత కూడా తమను  ఎమ్మెల్యేలుగా గుర్తించకపోతే కాంగ్రెస్ సభ్యులంతా  రాజీనామా చేయాలని డిమాండ్ లేవనెత్తారు. దీనిపై జానారెడ్డి ఒక్కరోజులోనే నిర్ణయం తీసుకోవాలని డెడ్ లైన్ పెట్టటం హాట్ చర్చనీయాంశం అయ్యింది. ఇద్దరు ఎమ్మెల్యేలను బహిష్కరిస్తే.. జానారెడ్డికి ఎలా నిద్రపడుతోందని కోమటిరెడ్డి నేరుగా ప్రశ్నించారు. బహిష్కరణను కొట్టేస్తూ హైకోర్టు మొదట ఆదేశాలిచ్చాక.. నేను,  సంపత్ మాత్రమే డీజీపీ, గవర్నర్, కేంద్ర ఎన్నికల సంఘం,  అసెంబ్లీ కార్యదర్శిని  కలిశాం అన్నారు. చాలాసార్లు  తామిద్దరమే  వెళ్ళామని.. ఒకట్రెండు సార్లు మాత్రమే  ముఖ్యనేతలు  తమతో వచ్చారని వారిద్దరూ అసహనం  వ్యక్తం చేశారు.ఇద్దరు  ఎమ్మెల్యేలను బహిష్కరించినా .. అటు పీసీసీ,  ఇటు సీఎల్పీ  పట్టించుకోలేదని తన అసహనాన్ని వెళ్లగక్కారు.

కోమటిరెడ్డి వెంకటరెడ్డి డిమాండ్ పై జానారెడ్డి స్పందించారు. రాజీనామాలకు నేనూ ఓకే  అంటూనే.. హైకమాండ్  నిర్ణయమే ఫైనల్ అంటూ మెలిక పెట్టారు. పీసీసీతోనూ మాట్లాడతామన్నారు. పార్టీ,  హైకమాండ్  ఏ నిర్ణయం తీసుకుంటే అలా చేస్తాను అన్నారు. ఎవరు పడితే వాళ్ళు వ్యక్తిగతంగా మాట్లాడితే స్పందించాల్సిన అవసరం  లేదన్నారు. ఇప్పటివరకు జరిగిందంతా పార్టీపరంగా, clpలోను అందరితో కలిసే నిర్ణయం తీసున్నామన్నారు  సీఎల్పీ నేత జానారెడ్డి. వీళ్లిద్దరి వ్యవహారం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలకు మరోసారి బయటపెట్టింది. జానాపై నేరుగా దాడికి దిగిన కోమటిరెడ్డి.. ఇంకెన్ని ఫిటింగ్స్ పెడతాడో అని నేతలు అంటుంటే.. హైకమాండ్ పేరుతో జానా కూడా ఆయింట్ మెంట్ బాగానే రాశామని ఆయన వర్గం నేతలు అంటున్నారు.

Posted in Uncategorized

Latest Updates