రాజేంద్రనగర్ అభివృద్ధికి రూ.2వందల కోట్లు: మంత్రి కేటీఆర్

ktrరాజేంద్రనగర్‌ అభివృద్ధిలో దూసుకుపోతోందన్నారు మంత్రి కేటీఆర్. రంగారెడ్డి జిల్లా అభివృద్ధిపై సీఎం కేసీఆర్‌ ప్రత్యేక దృష్టి పెట్టారన్నారు. రాజేంద్రనగర్‌లో పర్యటించిన… కేటీఆర్‌ రూ.100 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. మూసీ కాలువపై బుద్వేల్‌-కిస్మత్‌పూర్‌ వంతెనను  ప్రారంభించారు. నాలుగైదేళ్లలో బుద్వేల్, కిస్మత్‌పుర రూపు రేఖలు మారిపోతయన్నారు. రూ.1600 కోట్లతో మూసీ సుందరీకరణ పనులు చేపడుతున్నట్లు చెప్పారు. పంటకు పెట్టుబడి ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని, 58 లక్షల మందికి పైగా అన్నదాతలకు రైతు బీమా కల్పిస్తున్నామని తెలిపారు. గత పాలకులు పెన్షన్ల కోసం ఎంతో ఇబ్బంది పెట్టారని మండిపడ్డారు. 42 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నామని… పేదింటి ఆడబిడ్డల పెళ్లికి కల్యాణ లక్ష్మి, షాదీముభారఖ్ కింద రూ.లక్షా 116 ఇస్తున్నట్లు తెలిపారు. కేసీఆర్ కిట్ల ద్వారా 13 వస్తువులను ఇస్తున్నామన్నారు.  రాజేంద్ర నగర్ కు 200 కోట్ల రూపాయలు కేటాయిస్తామని హామీ ఇచ్చారు మంత్రి కేటీఆర్.

 

 

Posted in Uncategorized

Latest Updates