రాజ్యసభలోనే ఉండి.. టీడీపీ ఎంపీల నిరసన

TDPటీడీపీ ఎంపీలు రాజ్యసభలో ఆందోళన చేపట్టారు. సభ వాయిదా పడిన తర్వాత కూడా అక్కడే బైఠాయించారు. సభలోనే ఉండి నినాదాలు చేస్తున్నారు. ఏప్రిల్ 5వ తేదీ గురువారం రాజ్యసభ ప్రారంభం అయిన వెంటనే విపక్షాలు ఆందోళన చేశాయి. దీంతో సభను శుక్రవారానికి వాయిదా వేశారు డిప్యూటీ చైర్మన్ కురియన్. సభ్యులు అందరూ వెళ్లిపోయినా టీడీపీ ఎంపీలు మాత్రం బయటకు రాలేదు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ నిరసన చేపట్టారు. డిప్యూటీ చైర్ పర్సన్ కురియన్ సైతం టీడీపీ ఎంపీల దగ్గరకి వచ్చి చర్చించారు. ఆందోళన విరమించాలని.. సభ నుంచి బయటకు వెళ్లాలని కోరారు. అయినా వినకుండా సభలోనే నిరసన చేపట్టారు ఎంపీలు. ఉదయం నుంచి సభలోనే ఉన్న ఎంపీలకు వైద్య పరీక్షలు చేశారు వైద్యులు.

Posted in Uncategorized

Latest Updates