రాజ్యసభలో 22 భాషలు మాట్లాడవచ్చు

పార్లమెంటు వర్షాకాల సమావేశాలు బుధవారం(జూలై-18) ప్రారంభమయ్యాయి.  రాజ్యసభలో ఛైర్మన్ వెంకయ్య నాయుడు మాట్లాడుతూ ఎగువ సభలో సభ్యులు మాట్లాడేందుకు మరో ఐదు భారతీయ భాషలను చేర్చుతున్నట్లు ప్రకటించారు. దీంతో రాజ్యసభలో సభ్యులు 22 భాషలు మాట్లాడవచ్చు. సభ్యులు ఇవాళ్టి(బుధవారం) నుంచి డోంగ్రీ, కశ్మీరీ, కొంకణి, సంతాలీ, సింధి భాషల్లో సమావేశాల్లో ప్రసంగించవచ్చని తెలిపారు. ఇంతకుముందు 17భాషలకు మాత్రమే ఈ గుర్తింపు లభించింది. సభ్యులు మాత్రం ఇంటర్‌ప్రెటర్ కోసం సెక్రటేరియట్‌లో ముందస్తు నోటీసు ఇవ్వాల్సి ఉంటుంది.

 

Posted in Uncategorized

Latest Updates