రాజ్యసభ: జాతీయ పౌరసత్వ గుర్తింపు డ్రాఫ్ట్ పై విపక్షాల ఆందోళన

జాతీయ పౌరసత్వ గుర్తింపు డ్రాఫ్ట్ పై రాజ్యసభలో విపక్షాల ఆందోళన కొనసాగింది. ఈ మధ్యాహ్నం రెండు గంటలకు రాజ్యసభ ప్రారంభమైన వెంటనే విపక్షాలు చైర్మన్ పోడియాన్ని చుట్టుముట్టాయి. డ్రాఫ్ట్ బిల్లులో సవరణలు కోరుతూ.. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు నినాదాలు చేశారు. ఎన్నార్సీపై కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ వివరణకు చైర్మన్ అవకాశం ఇచ్చారు. రాజ్ నాథ్ సింగ్ ప్రసంగాన్ని విపక్షాలు అడ్డుకున్నాయి. సభా వ్యవహారాలు నడిచే పరిస్థితి లేకపోవడంతో… రాజ్యసభను రేపటికి వాయిదా వేశారు చైర్మన్ వెంకయ్య నాయుడు.

 

Posted in Uncategorized

Latest Updates