రాజ్యసభ రేపటికి వాయిదా

ఢిల్లీ:  ప్రతిపక్షాల ఆందోళనల మధ్య రాజ్యసభను శుక్రవారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు రాజ్యసభ ఛైర్మన్‌ వెంకయ్య నాయుడు. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఆనంద్‌ శర్మ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి విజయ్‌ గోయల్‌ మధ్య మంగళవారం రాజ్యసభలో తలెత్తిన వాదన గురించి వెంకయ్య నాయుడు ఇవాళ ప్రస్తావించారు. రికార్డులను పరిశీలించానని, అందులో ఎక్కడా విజయ్‌ గోయల్‌… రాహుల్‌ పేరును ప్రస్తావించలేదన్నారు.
మరోవైపు ఆంధ్రప్రదేశ్‌ ఎంపీలు ప్రత్యేక హోదా డిమాండ్‌ చేస్తూ నినాదాలు చేశారు. తమిళనాడు ఎంపీలు కావేరీ జల వివాదంపై చర్చను కోరుతూ ప్లకార్డులు పట్టుకొని వెల్‌లోకి దూసుకొచ్చారు. ‘‘దేశ ప్రజలంతా మనల్ని గమనిస్తున్నారు. చర్చించాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. ముఖ్యమైన బిల్లులు ఆమోదించాల్సి ఉంది. రఫేల్‌, తుపానులు, వ్యవసాయ సంక్షోభం వంటి ముఖ్యమైన అంశాలపై చర్చించాల్సి ఉంది’’ అని వెంకయ్య పదేపదే గుర్తు చేసినప్పటికీ సభ్యులు పట్టించుకోకుండా నినాదాలు చేశారు. అసహనంతో  ఛైర్మన్‌ వెంకయ్య రాజ్యసభను శుక్రవారానికి వాయిదా వేశారు.

Posted in Uncategorized

Latest Updates