రాజ్యాంగంతోనే తెలంగాణ సాధ్యమైంది : వివేక్ వెంకటస్వామి

VIVEKఅంబేద్కర్ రచించిన రాజ్యాంగంతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సాధ్యమైందన్నారు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డాక్టర్ జి.వివేక్ వెంకటస్వామి. అంబేద్కర్ యావత్ దేశ ప్రజలకు ఆదర్శప్రాయుడన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దళితుల అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తుందని చెప్పారు. అంబేద్కర్ స్పూర్తితో కేంద్ర మాజీమంత్రి వెంకటస్వామి ఆయన పేరుతో కాలేజ్ ఏర్పాటు చేసి ఎంతో మంది విద్యార్థులకు విద్యనందిస్తున్నారని అన్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా పెద్దపల్లి, మంచిర్యాల, జగిత్యాల జిల్లాలో ఆయన విగ్రహాలకు పూల మాలలు వేసి నివాళులర్పించారు వివేక్. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఐబీ చౌరస్తా, లక్సెట్టిపేట, హాజీపూర్ మండల కేంద్రాల్లో అనుచరులు, TRS నేతలు, కార్యకర్తలతో కలిసి అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు వివేక్.

Posted in Uncategorized

Latest Updates