రాజ్యాంగాన్ని కాంగ్రెస్ హేళన చేస్తుంది : మోడీ

ఢిల్లీ : కాంగ్రెస్ పై ప్రధాని నరేంద్ర మోడీ ఫైర్ అయ్యారు. రాఫెల్ యుద్ద విమానాల కేసుపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును కాంగ్రెస్ తప్పు పట్టడం.. రాజ్యాంగాన్ని హేళన చేయడమేనన్నారు. బుధవారం దక్షిణ భారత దేశంలోని.. విల్లూపూర్, వెల్లూర్, కాంచీపురం, పుదుచ్చేరి, తమిళనాడులోని దక్షిణ చెన్నై జిల్లాల బీజేపీ కార్యకర్తలతో మోడీ వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ది పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని  కార్యకర్తలను కోరారు.

సుప్రీం కోర్టును బీజేపీ ప్రభుత్వం తప్పుదోవ పట్టించింది : ఆనంద్ శర్మ
రాఫెల్ విషయంలో సుప్రీం కోర్టును బీజేపీ ప్రభుత్వం తప్పుదోవ పట్టించిందని కాంగ్రెస్ నేత ఆనంద్ శర్మ అన్నారు. మోడీ ప్రభుత్వం తప్పుడు సమాచారం ఇవ్వడంతో సుప్రీం కోర్టు సెల్ఫ్ గోల్ చేసుకుందని తెలిపారు.  రాఫెల్ తీర్పు పై బీజేపీ ఎందుకు సంబరాలు చేసుకుంటుందో తనకు తెలువడంలేదని అన్నారు.

Posted in Uncategorized

Latest Updates