రాజ్య‌స‌భ‌కు న‌లుగురు ఎంపీలు నామినేట్

కేంద్ర ప్రభుత్వం సిఫారసుతో నలుగురు ప్రముఖులను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ శనివారం(జూలై-14) రాజ్యసభకు నామినేట్ చేశారు. పెద్దల సభకు నామినేట్ అయిన వారిలో రైతు నేత రామ్ షకల్, రచయిత రాకేశ్ సిన్హా, క్లాసికల్ డ్యాన్సర్ సోనాల్ మాన్‌సింగ్, శిల్పి రఘునాథ్ మహాపాత్ర ఉన్నారు. ఈసారి ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన ఒకర్ని కూడా రాజ్యసభకు నామినేట్ చేయలేదు.

రచయిత రాకేశ్ సంఘపరివార్‌తో పని చేశారు. ఢిల్లీ వర్సిటీలో ఆయన ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. సోనాల్ మాన్‌సింఘ్ దేశంలో విఖ్యాత డ్యాన్సర్‌గా గుర్తింపు పొందారు. శిల్పి రఘునాథ్ మహాపాత్ర పూరిలోని జగన్నాథుడి ఆలయంలో పనిచేస్తున్నారు. ఉత్తరప్రదేశ్ కు చెందిన రైతు నేత రామ్ షకల్ దళిత నాయకుడు.

Posted in Uncategorized

Latest Updates