రాజ్‌ఘాట్‌ వద్ద రాహుల్‌ దీక్ష

rahulgandhiదళితులపై దాడులు, బీజేపీ ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ  ఇవాళ నిరాహార దీక్ష చేపట్టారు. వివిధ అంశాలపై అధికార బీజేపీ దుష్ప్రచారాలకు నిరసనగా, విభజన రాజకీయాలను వ్యతిరేకిస్తూ, సమాజంలో శాంతి సామరస్యాలను కోరుతూ ఈరోజు  అన్ని రాష్ట్రాల రాజధానులు, అన్ని జిల్లాల కేంద్రాల్లో కాంగ్రెస్ కార్యకర్తలు దీక్షలకు దిగారు. ఇందులో భాగంగా సోమవారం ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌లో దీక్షలో పాల్గొన్నారు  రాహుల్‌.   దీక్షకు ముందు రాజ్‌ఘాట్‌లోని జాతిపిత మహాత్మాగాంధీ సమాధి వద్ద రాహుల్‌ నివాళులర్పించారు. అనంతరం దీక్షలో పాల్గొన్నారు. రాహుల్‌తో పాటు కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు మల్లికార్జున్‌‌ ఖర్గే, షీలా దీక్షిత్‌, అశోక్‌ గెహ్లట్‌‌, అజయ్‌ మాకెన్‌ దీక్ష చేపట్టారు.

ఇదిలా ఉండగా ఈ ఆందోళనలకు కాంగ్రెస్‌ వివాదాస్పద నేతలు జగదీశ్‌ టైట్లర్‌‌, సజ్జన్‌ కుమార్‌లను దూరం పెట్టారు. దీక్ష నిమిత్తం రాజ్‌ఘాట్‌ వద్దకు చేరుకున్న జగదీశ్‌ను అక్కడి నుంచి వెళ్లిపోవాలని చెప్పినట్లు సమాచారం. జగదీశ్‌, సజ్జన్‌లు 1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో నిందితులుగా ఉన్నారు. వారు దీక్షలో పాల్గొంటే ప్రజల్లోకి వ్యతిరేక సంకేతాలు వెళ్లే అవకాశాలున్నాయని కాంగ్రెస్‌ భావించి వారిని దీక్షకు దూరం పెట్టింది.

Posted in Uncategorized

Latest Updates