రాజ్ తరుణ్ లవర్ ఫస్ట్ లుక్ రిలీజ్

RAJటాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ కొత్త సినిమా లవర్. ఈ మూవీ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ వీడియోను శనివారం ( జూన్ -16) ట్విట్టర్ ద్వారా రిలీజ్ చేసింది సినిమా యూనిట్.  డెబ్యూ డైరెక్ట‌ర్ అనీష్ కృష్ణ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో రాజ్ తరుణ్ సరసన రుద్ధి కుమార్ హీరోయిన్ గా నటిస్తోంది. మోష‌న్ పోస్ట‌ర్ లో న్యూ హెయిర్ స్టైల్ కనిపించాడు. పిల‌క‌తో రాజ్ త‌రుణ్ గెట‌ప్ స‌రికొత్త‌గా ఉంది. ఈ సినిమాకి బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ అంకిత్ తివారీ, రిషీ రిచ్‌చ ఆర్కో, త‌నిష్క్ బ‌గ్చీలు సాయి కార్తీక్‌ తో క‌లిసి మ్యూజిక్ అందిస్తున్నారు.

టైటిల్, పోస్టర్ చూస్తుంటే పక్కా లవ్ స్టోరీలా కనిపిస్తోంది.  శ్రీ వెంక‌టేశ్వ‌ర బేన‌ర్‌పై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ మూవీకి సంబంధించిన టీజ‌ర్‌, ట్రైల‌ర్ త్వరలోనే విడుద‌ల చేస్తామని చెప్పింది యూనిట్. జూలై 14వ తేదీన ఈ సినిమాను విడుద‌ల చేయాల‌ని నిర్మాత‌లు భావిస్తున్న‌ట్టు తెలుస్తోంది. లేటెస్ట్ గా రిలీజైన మోష‌న్ పోస్ట‌ర్‌ పై మీరు ఓ లుక్కేయండి.

Posted in Uncategorized

Latest Updates