రాజ్ భవన్ లో ఘనంగా దుర్గమ్మ పూజ

హైదరాబాద్: ఇవాళ దుర్గాష్టమి సందర్భంగా రాజ్‌ భవన్‌లో దుర్గాష్టమి పూజా కార్యక్రమం నిర్వహించారు. పూజా కార్యక్రమంలో గవర్నర్ నరసింహన్, అధికారులు పాల్గొన్నారు. దుర్గాష్టమి లేదా మహా అష్టమిని దుర్గామాత నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజు జరుపుకుంటారు. ఈరోజున దుర్గామాత నుంచి ఉద్భవించిన కాళికామాత.. రాక్షసులైన చండ, ముండ, రక్తబిజను చంపుతుంది. వీళ్లంతా రాక్షస రాజు మహిశాసురుడి కాపలాదారులు. వాళ్ల అంతానికి ప్రతీకగా.. నవరాత్రి ఉత్సవాల్లో ఎనిమిదో రోజున దుర్గామాతను పూజిస్తారు.

 

 

 

Posted in Uncategorized

Latest Updates