రాజ‌కీయాల్లోకి  క్రికెటర్ మహ్మద్ షమీ భార్య

టీమిండియా సీనియర్ పేసర్ మహ్మద్ షమీ భార్య హసీన్ జహాన్ రాజకీయాల్లోకి ఎంటరయ్యారు. మంబై సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు సంజయ్ నిరూపమ్ సమక్షంలో ఆమె కాంగ్రెస్ లో చేరారు. ఈ సందర్భంగా ఆమెకు సంజయ్ కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. క్రికెటర్ షమీ భార్య, మోడల్ హసీన్‌ను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు ట్విట్టర్‌లో ముంబై కాంగ్రెస్ అధికారిక ఖాతాలో తెలిపారు.

ష‌మీకి ప‌లువురు మ‌హిళ‌ల‌తో అక్ర‌మ సంబంధాలున్నాయ‌ని ఆరోపిస్తూ.. వాటికి సంబంధించిన ఫొటోల‌ను బయటపెట్టారు హసీన్ జహాన్. షమీపై హత్యాయత్నం, గృహ హింస కేసులు కూడా పెట్టింది. వీటిపై కోల్‌క‌తా పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.

 

 

Posted in Uncategorized

Latest Updates