రాణిగంజ్ లో అదుపులోకి వచ్చిన మంటలు

rani సికింద్రాబాద్ రాణిగంజ్ గ్యాస్ మండిలో చెలరేగిన మంటలు అదుపులోకి వచ్చాయి. ఆరు ఫైరింజన్లు దాదాపు నాలుగు గంటలపాటు శ్రమించడంతో మంటలు అదుపులోకి వచ్చాయి. చిన్న గల్లి కావడంతో ఫైరింజన్లు లోపలికీ వెళ్లేందుకు ఇబ్బందులేర్పడ్డాయి. ప్రమాదంలో దాదాపు 3 కోట్ల వరకు ఆస్తినష్టం జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. మంటల ధాటికి మూడంతస్ధుల భవనం కుప్పకూలిపోయింది. మంత్రి తలసాని, మేయర్‌ రామ్మోహన్‌, సీపీ అంజనీకుమార్, కమిషనర్‌ జనార్దన్‌రెడ్డి, అధికారులు ఘటనాస్ధలిని పరిశీలించారు. ఒక్కసారిగా మంటలు ఎగసిడి నిమిషాల్లోనే గోదాం మొత్తాన్ని కమ్మేసి చుట్టుపక్కలకు వ్యాపించాయి. పెయింట్స్, కెమికల్స్ గోదాం కావడంతో  మంటలు వేగంగా వ్యాపించాయి.వేడి తీవ్రతకు కెమికల్ డ్రమ్ములు పేలడంతో చుట్టుపక్కల జనం భయాందోళనకు గురయ్యారు.

 

Posted in Uncategorized

Latest Updates