రాత్రంతా డ్రంక్ అండ్ డ్రైవ్ : వెంటాడి.. వేటాడి పట్టుకున్నారు.

DRUNKసాధారంగా ఎప్పుడూ రాత్రి 11 గంటల వరకూ మాత్రమే డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపడతారు పోలీసులు. అయితే శనివారం(మే-26) తెల్లవారు జామువరకూ బంజారాహిల్స్, జూబ్లిహిల్స్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేశారు. నాలుగు ఏరియాల్లో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో 84 మంది మద్యం సేవించి వాహనాలు నడుపుతున్నట్లు గుర్తించి వారిపై కేసులు నమొదు చేశారు పోలీసులు. మంగళవారం వీరిని కోర్టులో హాజరుపర్చనున్నారు. ఎక్కువగా ఫోర్ వీలర్స్ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడ్డాయి. మెత్తం 60 కార్లు, 24 బైక్ లను పోలీసులు సీజ్ చేశారు. తనీఖీల సమయంలో కొందరు వాహనదారులు తప్పించుకునేందుకు ప్రయత్నించగా పోలీసులు వెంబడించి మరీ వారిని పట్టుకున్నారు.

Posted in Uncategorized

Latest Updates