రాత్రంతా వర్ష బీభత్సం…నీట మునిగిన లోతట్టు ప్రాంతాలు

rainనైరుతి రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలో వానలు పడుతున్నాయి. రుతుపవనాలు బలపడడంతో జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. రెండు రోజుల నుంచి జిల్లాలతో పాటు హైదరాబాద్ లో కూడా వానలు దంచికొడుతున్నాయి. నిన్న(శుక్రవారం) రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో వానలు పడుతున్నాయని వాతావరణశాఖ ప్రకటించింది.

(శుక్రవారం) రాత్రి హైదరాబాద్  లోనూ చాలాచోట్ల వర్షం దంచికొట్టింది. 4, 5 గంటలపాటు ఎడతెరిపిలేకుండా వాన పడింది. ఎల్బీనగర్, దిల్ సుఖ్ నగర్, ఉప్పల్, కోఠి, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మణికొండ, హైటెక్ సిటీ, కొండాపూర్ లో వాన పడింది. పలు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఇళ్లలోకి వర్షం నీరు చేరడంతో జనం ఇబ్బంది పడుతున్నారు. సనత్ నగర్, ఎర్రగడ్డ, ESI ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. సికింద్రాబాద్, ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్డు దగ్గర  వర్షం నీరు రోడ్లపై నిలిచిపోవడంతో ప్రయాణీకులు ఇబ్బంది పడ్డారు. మరోవైపు ఇవాళ, రేపు పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ చెబుతుంది. మరో 4 రోజుల వరకు వర్షాలు కొనసాగే చాన్సుంది. నిన్న ఒక్కరోజే ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ లో అత్యధికంగా 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మెదక్ జిల్లా నర్సాపూర్లో 8, పెద్దపల్లిలో 8.2, సంగారెడ్డిలో 7.9, రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో 7, కరీంనగర్ లో 6.9, జగిత్యాలలో 6.6 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం రికార్డైంది.

జయశంకర్ భూపాలపల్లి, మంచిర్యాల జిల్లాల్లో వర్షం దంచికొట్టింది. సింగరేణి ఓసీ గనుల్లో బొగ్గు ఉత్పత్తికి బ్రేక్ పడింది. నిర్మల్ జిల్లాలో ఉరుములతో కూడిన వర్షం పడింది. ఆసిఫాబాద్ జిల్లాలో రెండు గంటలకు పైగా వాన పడింది. కరీంనగర్ జిల్లా కేంద్రంలో నిన్న వాన దంచికొట్టింది. పెద్దపల్లి జిల్లా మంధనితో పాటు చాలా గ్రామాల్లో భారీ వర్షం కురిసింది. సిరిసిల్ల జిల్లా వేములవాడలో చిరుజల్లులు కురిశాయి. నల్గొండ జిల్లాలో చాలాచోట్ల ఈదురుగాలులతో వర్షం పడింది. సూర్యాపేట జిల్లాతో పాటు ఖమ్మంలోనూ వాన దంచికొట్టింది. వికారాబాద్, మెదక్, వరంగల్, హన్మకొండలోనూ వర్షం కురిసింది.

Posted in Uncategorized

Latest Updates